నిజామాబాదు: ఎడపల్లి మండలం అలీసాగర్ లో విషాధ ఘటన చోటు చేసుకుంది. ఆదివారం సెలవు రోజున సరదాగా గడిపేందుకు వచ్చిన ముగ్గురు బాలికలు చెరువులో పడి మృతి చెందారు. హైదరాబాద్ కు చెందిన ఇద్దరు బాలికలు బోధన్ రాకాసిపేట్ లోని తమ బంధువుల ఇంటికి వచ్చారు. బంధువుల ఇంటికి వచ్చిన సందర్భంగా బోధన్ కు చెందిన తమ బంధువుల అమ్మాయితో కలసి ముగ్గురు బాలికలు పార్కు చూసొస్తామని ఇంట్లో చెప్పి ఎడపల్లి మండలం అలీసాగర్ చెరువు వద్దకు వచ్చారు. సరదాగా సెల్ఫీ తీసుకుందామని ప్రయత్నించి ఒకరి వెనుక మరొకరు నీళ్లలో పడినట్లు స్థానికుల సమాచారం. మృతులు జుబేరా (16), మాహెరా (14), మెహరాజ్ (12) అని చెబుతున్నారు. మృతులు ముగ్గురు దాదాపు ఒకే ఈడు వయసు బాలికలుగా కనిపిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.