ముగ్గురు ఇండియన్ ఫొటోగ్రాఫర్లకు పులిట్జర్ ప్రైజ్

ముగ్గురు ఇండియన్ ఫొటోగ్రాఫర్లకు పులిట్జర్ ప్రైజ్

న్యూయార్క్: ప్రపంచవ్యాప్తంగా జర్నలిజంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన పులిట్జర్ ప్రైజ్.. ముగ్గురు ఇండియన్స్ ని వరించింది. అసోసియేటెడ్ ప్రెస్ లో పనిచేస్తున్న ముగ్గురు ఫొటో జర్నలిస్టులు చన్నీ ఆనంద్, దార్ యాసిన్, ముక్తార్ ఖాన్ లు.. 2020 సంవత్సరానికి గాను ఫీచర్ ఫొటోగ్రఫీ విభాగంలో ప్రైస్ ను గెలుచుకున్నారు. ఈ మేరకు యూఎస్ కొలంబియా యూనివర్సిటీలోని పులిట్జర్ బోర్డు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. కిందటేడాది జమ్మూకాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు సమయంలో అక్కడి జీవన చిత్రాలను కల్లకు కట్టినట్లు చూపించినందుకు ముగ్గురిని అవార్డుకు ఎంపిక చేసినట్లు తెలిపింది. దార్ యాసిన్, ముక్తార్ ఖాన్ లు శ్రీనగర్ జిల్లాకు, చన్నీ ఆనంద్ జమ్మూ జిల్లాకు చెందినవారు.