బీజాపూర్‌‌‌‌లో ఎన్‌‌‌‌కౌంటర్.. ముగ్గురు మావోయిస్టులు మృతి

బీజాపూర్‌‌‌‌లో ఎన్‌‌‌‌కౌంటర్.. ముగ్గురు మావోయిస్టులు మృతి

భద్రాచలం, వెలుగు: చత్తీస్‌‌‌‌గఢ్‌‌‌‌లోని బీజాపూర్ జిల్లాలో బుధవారం (నవంబర్ 05) జరిగిన ఎన్‌‌‌‌కౌంటర్‌‌‌‌లో ముగ్గురు మావోయిస్టులు మరణించారు. తాళ్లగూడెంలోని అన్నారం-మరిమళ్ల గ్రామాల అటవీ ప్రాంతంలో మద్దేడు ఏరియా కమిటీకి చెందిన మావోయిస్టులు సమావేశమైనట్లు భద్రతాబలగాలకు పక్కా సమాచారం అందింది. 

ఈ సమాచారం ఆధారంగా భద్రతా బలగాలు కూంబింగ్‌‌‌‌కు వెళ్లిన సమయంలో ఇరువర్గాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు చనిపోగా..వారి నుంచి భద్రతా బలగాలు భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నాయి. బలగాలు ఇంకా అడవుల్లోనే ఉన్నాయని, కాల్పులు కొనసాగుతున్నాయని.. పూర్తి సమాచారం తర్వాత వివరాలు అందిస్తామని ఎస్పీ జితేంద్రకుమార్​ యాదవ్​ తెలిపారు.