
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది. తెలంగాణలో ఆరుగురు మంత్రులు ఎర్రబెల్లి, ఇంద్రకరణ్ రెడ్డి, పువ్వాడ అజయ్, కొప్పుల ఈశ్వర్, వేముల ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస గౌడ్ ఐదు రౌండ్లు పూర్తయ్యే సమయానికి ( 11 గంటల వరకు) వెనుకంజలో ఉన్నారు. ఇక ఈటల రాజేందర్ తాను పోటీ చేసిన రెండు స్థానాల్లో వెనుకంజలో ఉన్నారు. తాజా సమాచారం ( 11 గంటల వరకు) కాంగ్రెస్ 65, బీఆర్ఎస్43 స్థానాల్లో ముందంజలో కొనసాగుతున్నాయి.