హైదరాబాద్‌సిటీ, వెలుగు : గ్రేటర్ లో రోడ్డు దాటడానికి పాదచారులు పడుతున్న కష్టాలు, ట్రాఫిక్సమస్య నివారణకు నగరంలోని మరో మూడు ప్రాంతాల్లో స్కైవాక్లు నిర్మించడానికి హెచ్ఎండీఏలోని హుమ్టా ప్రతిపాదనలు సిద్ధం చేసింది. మెట్రోస్టేషన్లు, బస్టాండ్లను కలుపుతూ సమీప కాలనీలకు లింక్‌చేయడం ద్వారా ట్రాఫిక్సమస్య తగ్గించవచ్చని భావిస్తోంది.
అందులో భాగంగానే అత్యంత రద్దీగా ఉండే ఉప్పల్చౌరస్తాలో స్కైవాక్నిర్మించగా, మంచి ఫలితాలు కనిపించాయి. దీంతో మెహిదీపట్నంలో స్కైవాక్పనులు ప్రారంభించి పూర్తి చేశారు. త్వరలో దీన్ని ప్రారంభించనున్నారు. ఇక సికింద్రాబాద్రైల్వే స్టేషన్పరిసరాల్లో ఒకటి, కూకట్పల్లి జేఎన్టీయూ వద్ద మరో స్కైవాక్ నిర్మించాలని ఇప్పటికే నిర్ణయించారు. వీటితో పాటు మరో మూడు ప్రాంతాల్లో స్కైవాక్‌ల నిర్మాణానికి ప్రపోజల్స్రెడీ చేశారు.
ఆ మూడు ప్రాంతాలు ఏవంటే..
విజయవాడ, నల్గొండ నేషనల్హైవేను కలిపే ఎల్బీనగర్చౌరస్తా అత్యంత రద్దీగా ఉంటుంది. రోజూ వేల సంఖ్యలో వాహనాల రాకపోకలతో ఇక్కడి రోడ్డు దాటాలంటే ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. ఇక్కడ కూడా మెట్రోస్టేషన్, బస్టాప్‌ను కలుపుతూ సమీపంలోని కాలనీలకు వెళ్లేలా స్కైవాక్నిర్మించనున్నారు. అలాగే అతిపెద్ద కమర్షియల్సెంటర్గా, కోచింగ్ సెంటర్లకు అడ్డాగా పేరున్న దిల్సుఖ్నగర్..రోజూ స్థానిక, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వ్యాపారులు, స్టూడెంట్స్‌తో కిటకిటలాడుతూ ఉంటుంది.
ఇక్కడ బస్సులు దిగిన వారు రోడ్డు దాటడానికి కష్టాలు పడుతున్నారు. ఇక్కడ కూడా మెట్రోస్టేషన్, బస్స్టేషన్లను కలుపుతూ స్కైవాక్నిర్మిస్తారు. ఇక ట్రాఫిక్సమస్యకు ప్రధాన కేంద్రమైన ఐటి కారిడార్‌లోని రాయదుర్గం మెట్రో స్టేషన్, బస్స్టేషన్లను కలుపుతూ ఐకియా వద్ద స్కైవాక్ నిర్మించబోతున్నారు. వీటికి సంబంధించిన పూర్తి రిపోర్ట్ సిద్ధమయ్యాక టెండర్లను ఆహ్వానించనున్నట్టు అధికారులు తెలిపారు.
