- సిబ్బందిపై వర్క్ ప్రెజర్ తగ్గించేందుకు ప్లాన్
గచ్చిబౌలి, వెలుగు: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని ఐటీ కారిడార్‌లో మూడు కొత్త ట్రాఫిక్ సెక్టార్లు ఏర్పాటు చేస్తున్నారు. సిటీ నలుమూలల నుంచి డైలీ ఐటీ, ఇతర ఉద్యోగులు ఐటీ కారిడార్‌కు వస్తుంటారు. దీంతో మాదాపూర్, గచ్చిబౌలి, కూకట్పల్లి ట్రాఫిక్పీఎస్ల పరిధిలో వెహికల్స్ రద్దీ ఎక్కువగా ఉంటోంది. ఈ స్టేషన్ల పరిధిలోని ఆఫీసర్లు, సిబ్బందిపై వర్క్ ప్రెజర్ఎక్కువగా ఉంటోంది. ఈ నేపథ్యంలో కొత్త సెక్టార్లు ఏర్పాటు చేస్తే సిబ్బందిపై వర్క్బర్డెన్ తగ్గి, ట్రాఫిక్ కంట్రోలింగ్ ఈజీ అవుతుందని ట్రాఫిక్ డీసీపీ విజయ్‌కుమార్ తెలిపారు. మాదాపూర్, గచ్చిబౌలి, కూకట్పల్లి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల పరిధిలో సోమవారం నుంచి కొత్త సెక్టార్లు అందుబాటులోకి రానున్నాయని చెప్పారు. మాదాపూర్ట్రాఫిక్ పీఎస్ పరిధిలో రాయదుర్గం సెక్టార్, గచ్చిబౌలి పీఎస్ పరిధిలో నార్సింగి సెక్టార్, కూకట్పల్లి ట్రాఫిక్ పీఎస్ పరిధిలో కేపీహెచ్ బీ సెక్టార్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. రాయదుర్గం సెక్టార్ రాయదుర్గం లా అండ్ ఆర్డర్ పీఎస్ బిల్డింగ్‌లోని హాల్లో, నార్సింగి సెక్టార్ నార్సింగి లా అండ్ ఆర్డర్ పీఎస్‌లోని రూమ్‌లో, కేపీహెచ్ బీ సెక్టార్ కేపీహెచ్ బీ లా అండ్ ఆర్డర్ పీఎస్ పక్కనే ఉన్న హాల్లో ఏర్పాటు చేశామన్నారు. సీపీ స్టీఫెన్ రవీంద్ర ఒక్కో సెక్టార్‌కు ఒక ఇన్స్పెక్టర్, ఇద్దరు ఎస్సైలు, 45 మంది కానిస్టేబుల్స్ కేటాయించినట్లు తెలిపారు. సోమవారం నుంచి సిబ్బంది డ్యూటీ స్టార్ట్ చేస్తారు.
