ఎల్​ఐసీలో పాన్​ అప్​డేట్​ ఇలా..

ఎల్​ఐసీలో పాన్​ అప్​డేట్​ ఇలా..

న్యూఢిల్లీ: మెగా ఐపీఓ కోసం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) ఫిబ్రవరి 13, 2022న సెబీకి డాక్యుమెంట్లను దాఖలు చేసింది. ఈ ఇష్యూ మార్చిలో ప్రజల కోసం అందుబాటులోకి వస్తుంది. ఇది దేశంలోనే అతిపెద్ద  ఇనీషియల్​ పబ్లిక్​ ఆఫర్​ (ఐపీఓ) కానుంది. ఎల్ఐసీ సెబీకి అందించిన డీఆర్​హెచ్​పీ ప్రకారం, కంపెనీ 10 శాతం షేర్లను ఎల్ఐసీ పాలసీదారులకు రిజర్వ్ చేస్తుంది. పాలసీదారులు ఈ రిజర్వేషన్​ను దక్కించుకోవడానికి తమ పాలసీలను పర్మనెంట్ అకౌంట్ నంబరు (పాన్)తో లింక్ చేయాలి. ఇందుకు సోమవారం.. అంటే ఫిబ్రవరి 28, 2022 చివరి తేదీ.
ఎల్ఐసీ పాలసీలను పాన్‌‌‌‌తో లింక్ చేయడం చాలా ఈజీ. ఎల్ఐసీ అధికారిక వెబ్​సైట్​ ద్వారా నిమిషాల్లో పని పూర్తి చేయవచ్చు.

స్టెప్ 1: మొదటగా licindia.in అనేక ఎల్ఐసీ అధికారిక వెబ్‌‌సైట్‌‌కి లాగిన్ అవ్వాలి.
స్టెప్ 2: ఇప్పుడు, హోమ్‌‌పేజీలో ఉన్న 'ఆన్‌‌లైన్ పాన్ రిజిస్ట్రేషన్' ఆప్షన్ ఎంచుకోవాలి.
స్టెప్ 3:  ఇప్పుడు పాన్ కార్డ్‌‌ని లింక్ చేయవలసిన పాలసీల జాబితాను దగ్గర ఉంచుకోవాలి
స్టెప్ 4: ఈదశలో 'ప్రొసీడ్' ఆప్షన్ క్లిక్ చేయాలి
స్టెప్ 5: పాలసీహోల్డర్ ఈ-–మెయిల్ ఐడి, పాన్ నంబర్, మొబైల్ నంబర్, పాలసీ నంబర్‌‌ను ఇవ్వాలి. క్యాప్చా కోడ్ ఎంటర్ చేసిన తర్వాత 'ఓటీపీ పొందండి'పై ట్యాబ్ పై క్లిక్ చేయాలి.
స్టెప్ 6:   మొబైల్ నంబర్‌‌కు వచ్చిన ఓటీపీని నమోదు చేయాలి
స్టెప్ 7: ఫారమ్‌‌ను సమర్పించిన తర్వాత, రిజిస్ట్రేషన్ రిక్వెస్ట్ విజయవంతమైందనే మెసేజ్ వస్తుంది.