ఇండియాతో గ్రేట్ డీల్ కుదుర్చుకుంటం.. ప్రధాని మోడీ గొప్ప లీడర్: ట్రంప్

ఇండియాతో గ్రేట్ డీల్ కుదుర్చుకుంటం.. ప్రధాని మోడీ గొప్ప లీడర్: ట్రంప్

బెర్న్: ఇటీవల ఇండియాపై సుంకాల పేరుతో విరుచుకుపడుతోన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దావోస్ వేదికగా భారత పట్ల పాజిటివ్ కామెంట్స్ చేశారు. అలాగే భారత ప్రధాని మోడీని ప్రశంసించారు. బుధవారం (జనవరి 21) దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో ట్రంప్ పాల్గొన్నారు. ఆరు సంవత్సరాల తర్వాత దావోస్ సదస్సుకు హాజరైన అమెరికా ప్రెసిడెంట్ ప్రపంచ ఆర్థిక వేదికను ఉద్దేశించి ప్రసంగించారు. 

అనంతరం ఆయన భారత మీడియాతో మాట్లాడుతూ.. ఇండియాతో గొప్ప వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంటామని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇరు వర్గాలకు అనుకూలమైన ఒప్పందం కుదురుతుందని పేర్కొన్నారు. ఇక, భారత ప్రధాని మోడీ  అద్భుతమైన నాయకుడు అని కొనియాడారు. ఆయన పట్ల తనకు చాలా గౌరవం ఉందని పేర్కొన్నారు. కాగా, రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇండియాకు వ్యతిరేకంగా ట్రంప్ పలు నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే.

►ALSO READ | భారత్-పాక్ యుద్ధాన్ని నేనే ఆపినా: ఈసారి దావోస్‎లో డప్పు కొట్టుకున్న ట్రంప్

ఇండియాపై 50 శాతం వాణిజ్య సుంకాలు విధించడం, భారతీయ విద్యార్థులకు వీసా రూల్స్ కఠినతరం చేయడం వంటి నిర్ణయాలు తీసుకున్నారు. అంతేకాకుండా భారత బద్ద శత్రువు పాకిస్తాన్‎తో ట్రంప్ సన్నిహితంగా మెలుగుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇండియాపై ట్రంప్ మెతక వైఖరి ప్రదర్శించడం చర్చనీయాంశంగా మారింది.