భారత్-పాక్ యుద్ధాన్ని నేనే ఆపినా: ఈసారి దావోస్‎లో డప్పు కొట్టుకున్న ట్రంప్

భారత్-పాక్ యుద్ధాన్ని నేనే ఆపినా: ఈసారి దావోస్‎లో డప్పు కొట్టుకున్న ట్రంప్

బెర్న్: ఇండియా-పాకిస్తాన్ యుద్ధాన్ని తానే ఆపానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి డబ్బా కొట్టుకున్నారు. బుధవారం (జనవరి 21) వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఆరు సంవత్సరాల తర్వాత దావోస్ సదస్సుకు హాజరైన ట్రంప్ ప్రపంచ ఆర్థిక వేదికను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. తాను రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇప్పటి వరకు 8 యుద్ధాలను ఆపానని ఆయనకు ఆయనే గొప్పలు చెప్పుకున్నారు. 

అందులో ఇండియా-పాక్ వార్ కూడా ఉందని పేర్కొన్నారు. 2025 ఏప్రిల్, మే నెలల్లో ఇండియా పాక్ మధ్య పరిస్థితులు యుద్ధానికి దారి తీశాయని.. వెంటనే తాను జోక్యం చేసుకునే వార్ జరగకుండా నివారించానని ప్రగల్భాలు పలికారు. సుదీర్ఘకాలంగా సాగుతోన్నరష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపాడానికి సంవత్సరం నుంచి పని చేస్తున్నానని చెప్పారు. కొన్నేండ్లుగా సాగుతోన్న యుద్ధాలను ఒక్కరోజులోనే ఆపానని సెల్ఫ్ ఎలివేషన్ ఇచ్చుకున్నారు. 

కాగా.. 2025లో పహల్గాం ఉగ్రదాడికి కౌంటర్‎గా భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టిన విషయం తెలిసిందే. ఆపరేషన్ సిందూర్‎తో ఇండియా  పాక్ మధ్య సైనిక ఘర్షణలు నెలకొన్నాయి. దాదాపు నాలుగు రోజుల పాలు ఇరుదేశాలు మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. చివరకు ఇరుదేశాలు కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకున్నాయి. అయితే.. ఇండియా పాక్ మధ్య తానే కాల్పులు విరమణ ఒప్పందాన్ని కుదిర్చి యుద్ధాన్ని ఆపానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ క్లయిమ్ చేసుకుంటుకున్నారు.

 ఇప్పటికీ ఓ 70, 80 సార్లు ఇవే వ్యాఖ్యలు చేశాడు. అయితే.. భారత్-పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం విషయంలో ఏ మధ్యవర్తి ప్రమేయం లేదని.. కేవలం ద్వైపాక్షిక చర్చల ద్వారానే సైజ్ ఫైర్ కుదిరిందని భారత్ ఇప్పటికే ఎన్నోసార్లు స్పష్టం చేసింది. తన వల్లే భారత్, పాక్ యుద్ధం ఆగిందన్న ట్రంప్ వ్యాఖ్యలను ఇండియా బహిరంగంగా ఖండిస్తూ వస్తోంది. అయినప్పటికీ ట్రంప్ మళ్లీ అదే మొండి వాదన చేస్తున్నారు. ఇండియా పాక్ యుద్ధాన్ని నేనే ఆపానని ఈసారి దావోస్ లో ట్రంప్ సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నారు.