లింగంపేట, వెలుగు : మండలంలోని ఎల్లారం, బానాపూర్తండా గ్రామపంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. ఎల్లారం గ్రామ సర్పంచ్‌గా గంగి లింగం, బానాపూర్ తండా సర్పంచ్‌గా పీర్సింగ్ ను ఎన్నుకున్నారు. రెండు పంచాయతీల్లో వార్డు సభ్యులను సైతం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఏకగ్రీవంగా ఎన్నికైన పాలకవర్గ సభ్యులు సింగిల్ నామినేషన్లు వేయాలని ఇరు గ్రామాల ప్రజలు నిర్ణయించినట్లు తెలిపారు.
కాటేపల్లి తండా సర్పంచ్ ఏకగ్రీవం
పిట్లం : పెద్దకొడప్గల్ మండలం కాటేపల్లి తండా సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది. గోతి రవీందర్‌ను సర్పంచ్‌గా ఎ న్నుకున్నారు. తండాలో కాయితీ లంబాడాలు ఉండగా వారు బీసీ కేటగిరీ కిందకు వస్తారు. గత ఎన్నికల్లో అధికారులు తండాను పొరపాటుగా ఎస్టీలకు కేటాయించడంతో ఎస్టీలు లేక ఎవరూ నామినేషన్ వేయలేదు. ఏడు సంవత్సరాలు ప్రత్యేక అధికారి పాలన సాగింది. తండాలో 570 ఓటర్లు ఉన్నారు. తండా అభివృద్ధికి కృషి చేస్తానని ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్అభ్యర్థి రవీందర్ తెలిపారు. తనపై నమ్మకంతో సర్పంచ్‌గా ఎన్నుకున్న తండావాసులకు కృతజ్ఞతలు తెలిపారు.
