హైదరాబాద్ లో రోడ్ టెర్రర్.. అతివేగానికి ముగ్గురు బలి

హైదరాబాద్ లో రోడ్ టెర్రర్.. అతివేగానికి ముగ్గురు బలి

గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ రోడ్డులో లింగంపల్లి వైపు వెళ్తున్న కారు అదుపుతప్పి చెట్టుకు ఢీకొని ముగ్గురు చనిపోయారు. మృతుల్లో ఒకరు జూనియర్ ఆర్టిస్టు, ఒక స్టూడెంట్ ఉండగా.. మరోకరిని బ్యాంకు ఉద్యోగిగా పోలీసులు గుర్తించారు. సిద్దూ అనే మరో జూనియర్ ఆర్టిస్ట్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అతడిని హాస్పిటల్ కు తరలించి ట్రీట్ మెంట్ అందిస్తున్నారు. మృతులను మహబూబ్ నగర్ కు చెందిన మానస, కర్ణాటకకు చెందిన మానస, విజయవాడకు చెందిన బ్యాంకు ఉద్యోగి అబ్దుల్లాగా పోలీసులు తేల్చారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. 

For More News..

రైతుబంధుకు వారు కూడా అప్లై చేసుకోవచ్చు