
ఢిల్లీలో మూడంతస్థుల భవనం కుప్పకూలింది. సదర్ బజార్ లో ఉండే ఓ పాత భవంతి అకస్మాత్తుగా కూలిపోయింది. ఈ ప్రమాదం మంగళ వారం పొద్దున జరిగింది. విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేనుకున్న రెస్క్యూ టీం సహాయక చర్యలు చేపట్టారు. బిల్డింగ్ శిథిలాలను తొలగిస్తున్నారు. ఇప్పటి వరకు ఎవరూ గాయపడినట్లుగా, మృతి చెందినట్లు సమాచారం లేదు. అయితే శిథిలాల కింద కొందరు ఉన్నట్లు అనుమానిస్తున్నారు అధికారులు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
#WATCH Delhi: A three-storey building in Sadar Bazaar collapsed earlier today. No casualties reported pic.twitter.com/7XcJmAyYto
— ANI (@ANI) June 18, 2019