
ఆంధ్ర ప్రదేశ్: టీడీపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలకు నోలీసులు జారీచేసింది హైకోర్టు. గంటా శ్రీనివాసరావు, అనగాని సత్యప్రసాద్, గద్దె రామ్మోహన్‌ల ఎన్నికను సవాలు చేస్తూ వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు విచారణకు స్వీకరించింది. దీంతో ఈ ముగ్గురు ఎమ్మెల్యేలకు, రిటర్నింగ్ అధికారులకు కూడా నోటీసులు ఇచ్చింది. న్యాయమూర్తులు జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి, జస్టిస్ జి.శ్యాంప్రసాద్, జస్టిస్ ఎం.గంగారావు ఆర్డ్రర్స్ జారీచేయగా… విచారణ అక్టోబర్ 14కి వాయిదా పడింది.