10 తులాల గోల్డ్​ చైన్​గుంజుకెళ్లిన దుండగులు

10 తులాల గోల్డ్​ చైన్​గుంజుకెళ్లిన దుండగులు
  • నడిరోడ్డుపై చైన్‌‌ స్నాచింగ్‌‌

గండిపేట, వెలుగు: పట్టపగలు చైన్‌‌ స్నాచింగ్‌‌ ముఠా నడిరోడ్డుపై బీభత్సం సృష్టించింది. కారులో వెళ్తున్న ఓ వ్యక్తిని అడ్డగించి, దాడి చేసింది.  అతడి మెడలోని10 తులాల గోల్డ్​చైన్‌‌ను లాక్కొని పరారైంది. ఈ ఘటన రాజేంద్రనగర్‌‌ పోలీస్‌‌స్టేషన్‌‌ పరిధిలో ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. కన్నయ్యలాల్‌‌ అనే వ్యాపారి సన్‌‌సిటీలో స్వీట్ షాప్​నిర్వహిస్తున్నాడు. ఆదివారం మధ్యాహ్నం కారులో మెహిదీపట్నం నుంచి రాజేంద్రనగర్‌‌ బయలుదేరాడు. పిల్లర్‌‌ నెంబర్‌‌182 వద్ద యూ టర్న్‌‌ తీసుకుంటుండగా ఐదుగురు వ్యక్తులు కన్నయ్య లాల్​కారును ఆపారు. అతడిని బయటికి లాగి పిడుగుద్దులు గుద్దారు. మెడలోని 10 తులాల గోల్డ్​చైన్‌‌ను లాక్కుని పారిపోయారు.  బాధితుడి ఫిర్యాదుతో రాజేంద్రనగర్‌‌ పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.