యూపీ లోకల్ బాడీ ఎన్నికల్లో బీజేపీ గెలుపుపై సైనా హర్షం

V6 Velugu Posted on Jul 04, 2021

న్యూఢిల్లీ: ఉత్తర్ ప్రదేశ్ లోకల్ బాడీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడంపై బ్యాడ్మింటన్ చాంప్ సైనా నెహ్వాల్ హర్షం వ్యక్తం చేసింది. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు ఆమె శుభాకాంక్షలు తెలిపింది. యూపీ జిల్లా పంచాయత్ చైర్‌పర్సన్ ఎన్నికల్లో బ్రహ్మాండమైన విజయం సాధించిన యోగి ఆదిత్యనాథ్ సార్‌కు కంగ్రాట్స్ అంటూ సైనా ట్వీట్ చేసింది. తాజాగా యూపీలో 75 జిల్లా పరిషత్‌లకు ఎన్నికలు జరగ్గా.. బీజేపీ అరవై ఏడింటిని కైవసం చేసుకుంది. కాగా, వచ్చే ఏడాది యూపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జిల్లా పరిషత్‌లను గెల్చుకోవడం బీజేపీలో మనోధైర్యాన్ని పెంచిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 

 

Tagged Bjp, Uttar Pradesh, Saina Nehwal, Local Body Elections, CM Yogi Adityanath

Latest Videos

Subscribe Now

More News