సీసీ కెమెరాల్లో తప్ప.. బోనులో పడుతలే

సీసీ కెమెరాల్లో తప్ప.. బోనులో పడుతలే

గ్రేహౌండ్స్ ఫారెస్ట్ కట్ట దగ్గరకు వచ్చి వెళ్తున్నట్లు సీసీ ఫుటేజీ
4 వారాల నుంచి వెతుకులాట.. తప్పించుకు తిరుగుతున్న చిరుత

హైదరాబాద్, వెలుగు: మైలార్​దేవ్​పల్లిలో కలకలం రేపిన చిరుత నాలుగు వారాల నుంచి తప్పించుకు తిరుగుతోంది. 2 బోన్లు, 20 సీసీ కెమెరాలతో ఫారెస్ట్​ అధికారుల వెతుకులాట కొనసాగుతోంది. బోన్ల వద్దకు చిరుత రాకుండా జాగ్రత్త పడుతున్నట్లు శంషాబాద్​ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ విక్రమ్ చంద్ర  తెలిపారు. గగన్​పహాడ్, అగ్రికల్చర్ వర్సిటీ, గ్రేహౌండ్స్​ ఫారెస్ట్​ ఏరియాలోని కట్ట దగ్గరకు వచ్చి వెళ్తున్నట్లు మంగళవారం సీసీ ఫుటీజీలో గుర్తించినట్లు చెప్పారు. త్వరలోనే పట్టుకుంటామని, అప్పటిదాకా చుట్టుపక్కల ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాత్రిళ్లు బయటకి రావద్దన్నారు. కాగా, గత నెల 14న కనిపించిన చిరుతను నెల రోజులవుతున్నా పట్టుకోకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ సమీప ఏరియాల్లోనే తిరుగుతుండడంపై భయాందోళన చెందుతున్నారు.

For More News..

ఆషాడ బోనాలెట్ల?

ఆన్​లైన్​లో ఆఫర్స్ హంగామా

మరో పది రోజుల్లో టెన్త్ రిజల్ట్స్