తల్లిని అనుసరిస్తున్న పులి పిల్లలు.. బుడి బుడి అడుగులతో ఫాలోయింగ్​ 

తల్లిని అనుసరిస్తున్న పులి పిల్లలు.. బుడి బుడి అడుగులతో ఫాలోయింగ్​ 

సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించిన వీడియోలు ప్రతిరోజు వైరల్ అవుతూనే ఉంటాయి. అడవిలోని జంతువులకు సంబంధించిన వీడియాలకు మనకు చాలామంది అభిమానులు ఉంటారు. అవి చేసే పనులు కొన్నిసార్లు భయం పుట్టిస్తే.. మరి కొన్నిసార్లు నవ్వులు పూయిస్తాయి. ఈ మధ్య జంతువుల వీడియోలు నెట్టింట తెగ హల్చల్ అవుతున్నాయి. అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

అటవీ అధికారి సోషల్​మీడియాలో పోస్ట్​ 

తాజాగా వైరల్ అవుతున్న వీడియో పులికి సంబంధించినది.  ఈ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ సుశాంత నందా తన ట్విట్టర్ అకౌంట్లో షేర్ చేశాడు. పుటేజీలో.. పిల్లలు ..తల్లి పులితో కలిసి నడుస్తున్నాయి.  పులి ఎక్కడికి వెళితే  దాని పిల్లలు తల్లి పులిని అనుకరిస్తు వెళ్తున్నాయి.  

తల్లిని ఫాలో అవుతున్న పులి పిల్లలు 

దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.   వీడియోపై ఇప్పటికే చాలా మంది ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. తల్లిపులి అడవిలో నడుస్తూ ఉంటే.. వెనక నాలుగు పులి పిల్లలు బుడిబుడి అడుగులు వేస్తూ తల్లిని ఫాలో అవుతూ కనిపించాయి. ఈ వీడియో చూడటానికి చాలా బాగుందంటూ నెట్టింట తెగ వైరల్గా మారింది. తల్లి పులి ఎలా చేస్తే ...పులి పిల్లలు కూడా అలా చేస్తూ ఎంజాయ్ చేస్తున్నాయి. ఈ వీడియోను చూసిన జంతు ప్రేమికులు తెగ సంబర పడుతున్నారు. దీంతో మరోసారి పులికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.