‘టైగర్‌‌‌‌ నాగేశ్వరరావు’ యాక్షన్ షురూ

‘టైగర్‌‌‌‌ నాగేశ్వరరావు’ యాక్షన్ షురూ

డిసెంబర్‌‌‌‌లో ‘ధమాకా’తో సక్సెస్ అందుకున్న రవితేజ.. చిరంజీవితో కలిసి ‘వాల్తేరు వీరయ్య’ చిత్రంతో ఈరోజు ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. మరోవైపు ‘టైగర్‌‌‌‌ నాగేశ్వరరావు’ చిత్రంతో బిజీగా ఉన్నాడు. వంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. స్టూవర్ట్‌‌పురం గజదొంగ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా దీన్ని తెరకెక్కిస్తున్నారు. రవితేజ టైటిల్‌‌ రోల్‌‌ పోషిస్తున్నాడు. నుపూర్ సనన్‌‌ హీరోయిన్‌‌.

గురువారంతో ఈ మూవీ తాజా షెడ్యూల్ పూర్తయింది. సినిమాకెంతో కీలకమైన యాక్షన్ సీక్వెన్సుని ఈ షెడ్యూల్‌‌లో పిక్చరైజ్ చేసినట్టు మేకర్స్ ప్రకటించారు. అనుపమ్ ఖేర్‌‌‌‌, రేణుదేశాయ్ కీలకపాత్రల్లో నటిస్తుండగా, గాయత్రి భరద్వాజ్, మురళీశర్మ, షన్ముఖి తదితరులు కనిపించబోతున్నారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. శ్రీకాంత్ విస్సా డైలాగ్స్ రాస్తున్నాడు. రవితేజ హీరోగా నటిస్తున్న ఫస్ట్ ప్యాన్ ఇండియా సినిమా ఇది. దీంతో పాటు ‘రావణాసుర’ చిత్రంలోనూ రవితేజ నటిస్తున్నాడు.