విశాఖ తీరంలో సోమర్సెట్... బాహుబలి నౌక!

విశాఖ తీరంలో సోమర్సెట్... బాహుబలి నౌక!

టైగర్ ట్రయంప్ 24 కార్యక్రమానికి విశాఖపట్నం వేదిక అయ్యింది. భారత్, అమెరికా దేశాల సైనిక సంబంధాలు బలోపేతమయ్యేలా బంగాళాఖాతంలో విశాఖపట్నం కేంద్రంగా ఈ ప్రత్యేక సాగర విన్యాసాలు జరుగుతున్నాయని నేవీ అధికారులు తెలిపారు. రెండు వారాలపాటు జరగనున్న ఈ విన్యాసాల కోసం బాహుబలి నౌకగా పేరొందిన 'యూఎస్ సోమర్సెట్' విశాఖ తీరానికి చేరుకుంది. ఇది ఉభయచర నౌక. ఇందులో 25 భారీ యుద్ధ ట్యాంకర్లు, 4 యుద్ధ హెలికాఫ్టర్లు, నౌక నలువైపులా ఆయుధ ట్యాంకులు, వెయ్యి మంది సిబ్బంది ఇందులో ఉంటారు.

2001 సెప్టెంబర్ 11న వరల్డ్ ట్రేడ్ సెంటర్ పై జరిగిన ఉగ్రదాడిలో మరణించిన 93 మంది స్మారకంగా ఈ నౌకను నిర్మించారు. విపత్తు సమయంలో ఈ నౌకను రక్షణ దళాలు ఆసుపత్రిగా తీర్చిదిద్దటంతో ఈ అత్యాధునిక నౌకలలో ఒకటిగా చరిత్రలో నిలిచిందని నావికాదళ అధికారులు తెలిపారు. ఈ విన్యాసాలు రెండువారాల పాటు జరుగుతాయని అధికారులు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.