భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పులి జాడలు.. భయాందోళనల్లో రైతులు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పులి జాడలు.. భయాందోళనల్లో రైతులు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లో పులి సంచారం గత నెల రోజులుగా కలకలం సృష్టిస్తోంది. పదేళ్ల తర్వాత తొలిసారిగా జిల్లాలో మగపులి సంచరిస్తున్నట్లు గుర్తించారు. గుండాల, ఇల్లెందు, ఆళ్లపల్లి, మణుగూరు, కరకగూడెం, అశ్వరాపురం అడవుల్లో పులి జాడలు బయటపడ్డాయి.దీంతో జిల్లా ఏజెన్సీ వాసుల్లో భయందోళన నెలకొన్నాయి. బుధ‌వారం పాల్వంచ మండలం పాండురంగాపురం గ్రామం నుంచి ప్రభాత్ నగర్ వెళ్ళే మార్గం మద్యలో వెేల్పుల గుట్ట వద్ద పులి సంచారం చేసినట్లు పాదముద్రలు గుర్తించిన రైతులు..ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని పాదముద్రలు గుర్తించి వాటి అచ్చులు తీసారు. ఫారెస్ట్ అధికారులు మాత్రం అది పెద్ద పులి పాదముద్రలగా గుర్తించారు. ఇటు వైపు ఎవరు వెళ్ళవద్దని అక్కడికి రైతులకు సూచించారు.దీంతో అక్కడ రైతులు భయందోళన నెలకొన్నాయి. ఫారెస్ట్ అధికారులు పెద్ద పులిని త్వరగా పట్టుకోవాలని అక్కడ రైతులు కోరుకుంటున్నారు.