పులికి అంత్యక్రియలు చేసిన ఫారెస్ట్ సిబ్బంది

పులికి అంత్యక్రియలు చేసిన ఫారెస్ట్ సిబ్బంది

ఛత్తీస్గడ్ కొరియా జిల్లాలోని గురుఘాసిదాస్ నేషనల్ పార్కులో పులి మృతదేహానికి ఫారెస్ట్ అధికారులు అంత్యక్రియలు నిర్వహించారు. రామ్‌గఢ్ అడవుల్లోని సల్గావా గ్రామ సమీపంలో దట్టమైన అడవిలో పులి డెడ్బాడీని స్థానికులు గుర్తించి అటవీ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడకు చేరుకున్న ఫోరెన్సీక్ అధికారులు..విషం కలిపిన గేదె కళేబరాన్ని తిని పులి చనిపోయిందని తేల్చారు. చనిపోయిన పులి వయసు 7 నుంచి 8 సంవత్సరాలు ఉంటుందని నేషనల్ పార్కు  డైరెక్టర్ వై రంగనాధ రామకృష్ణ తెలిపారు. అనంతరం పులికి అంతిమసంస్కారాలు చేశారు. పులి చనిపోవడానికి కారణమైన నలుగురిని ఫారెస్ట్ అధికారులు అరెస్ట్ చేశారు. వారిని కోర్టులో హాజరుపరుస్తామన్నారు.