రంగారెడ్డి కలెక్టరేట్, వెలుగు: రంగారెడ్డి జిల్లా కందుకూర్ మండలం ఫ్యూచర్ సిటీలో ఈ నెల 8, 9 తేదీల్లో నిర్వహించే గ్లోబల్ సమిట్కు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు రాచకొండ సీపీ సుధీర్బాబు తెలిపారు. గురువారం ఆయన మీటింగ్ ప్రదేశాన్ని పరిశీలించి అడిషనల్ డీజీ ఫైర్ విక్రమ్ సింగ్ మాన్, ఫ్యూచర్ సిటీ డివలప్ మెంట్ అథారిటీ అధికారి శశాంకతో కలిసి రివ్యూ నిర్వహించారు. గ్లోబల్ సమిట్ సక్సెస్ అయ్యేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు.
లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్, స్పెషల్ బ్రాంచ్, ఇంటిలిజెన్స్, అక్టోపస్, గ్రేహౌండ్స్, డాగ్, బాంబ్ స్క్వాడ్‌తో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలన్నారు. సుమారు 600 మంది ప్రతినిధులు హాజరవుతున్నట్లు పేర్కొన్నారు. వెయ్యికి పైగా సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. రహదారుల మళ్లింపు, బారికేడ్ల ఏర్పాటు, వాహనాల పార్కింగ్ కోసం వెయ్యి మంది ట్రాఫిక్ సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
