న్యూఢిల్లీ: టీమిండియా క్రికెటర్, హైదరాబాదీ తిలక్ వర్మ ఇంకా పూర్తి ఫిట్‌నెస్ సాధించలేదు. దాంతో న్యూజిలాండ్‌తో చివరి రెండు టీ20లకు అతను దూరమయ్యాడు. పొత్తి కడుపు సర్జరీ నుంచి కోలుకుంటున్న తిలక్ ప్లేస్‌లో శ్రేయస్ అయ్యర్‌ను బుధ, శనివారాల్లో జరిగే నాలుగో, ఐదో మ్యాచ్‌ల్లో కొనసాగిస్తున్నట్టు బీసీసీఐ సోమవారం ప్రకటించింది. ‘సర్జరీ తర్వాత తిలక్ ఫిజికల్ ట్రెయినింగ్ మొదలు పెట్టాడు.
బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో అతని రిహాబిలిటేషన్ సంతృప్తిగానే ఉంది. కానీ, పుల్ మ్యాచ్ ఫిట్‌నెస్ సాధించేందుకు మరికొంత సమయం అవసరం. అందుకే న్యూజిలాండ్‌తో చివరి రెండు మ్యాచ్‌లకు అందుబాటులో ఉండటం లేదు. పూర్తి ఫిట్‌నెస్ అందుకున్న తర్వాత ఫిబ్రవరి 3న ముంబైలో టీ20 వరల్డ్ కప్ వామప్ మ్యాచ్‌కు ముందు ఇండియా జట్టులో కలుస్తాడు’ అని బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా పేర్కొన్నారు.
