
లవర్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ(Siddu Jonnalagadda) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ టిల్లు స్క్వేర్(Tillu Square). సూపర్ హిట్ డీజే టిల్లు సినిమాకు సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమా నుండి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమాను సెప్టెంబర్ 15 న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు అధికారిక ప్రకటన రిలీజ్ చేశారు నిర్మాత నాగ వంశీ(Naga Vamshi). ఈ మేరకు రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ కొత్త పోస్టర్ కూడా రిలీజ్ చేశారు.
ఈ కొత్త పోస్టర్ లో అనుపమ(Anupama Parameswaran), సిద్దు రొమాంటిక్ గా కనిపిస్తూ సినిమాపై మరింత క్యూరియాసిటీ పెరిగేలా చేస్తున్నారు. మల్లిక్ రామ్(Mallik Ram) డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలు సితార ఎంటర్టైన్మెంట్స్(Sitara Entertainments) బ్యానర్ పై నాగ వంశీ నిర్మిస్తున్నాడు. ఇక డీజీ టిల్లు(DJ Tillu) సూపర్ హిట్ అవ్వడంతో.. ఈ సీక్వెల్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఆ అంచనాలని టిల్లు అందుకుంటాడా? లేదా? అనేది తెలియాలంటే సెప్టెంబర్ 15 వరకు ఆగాల్సిందే.