క్షణం గడిస్తే తిరిగి రాదు. ఎవరి కోసమూ టైం ఆగదు. ఆపితే ఆగేదీ కాదు. ప్రతి ఒక్కరికీ రోజుకు ఇరవై నాలుగు గంటలే ఉంటాయి. సమయానికి విలువ కట్టటం అసాధ్యం. సమయాన్ని సరిగా వాడుకోవటం అంటే కాలంతోపాటు నడుస్తూ ఎదగడానికి అవసరమైన పని చేయడమే. అలా చేసిన వారు జీవితంలో ఏదైనా సాధిస్తారు.
- పనిని వాయిదా వేయకుండా ఎప్పుడు చేయాల్సిన పనిని అప్పుడే చేయటం. ఒకవేళ ఇంకా సమయం మిగిలితే తర్వాతి రోజు పనిని కూడా ముందురోజే ముగించటం.
- సమయం వృథా కాకుండా ఉండాలంటే మనిషికి ఏకాగ్రత చాలా అవసరం. కాబట్టి రోజూ ఏకాగ్రతను పెంచే ధ్యానం, యోగా లాంటివి చేయడం వల్లమనసు ప్రశాంతంగా ఉంటుంది. వ్యాయామం ద్వారా కూడా. ఏకాగ్రత పెరుగుతుందని వైద్యులు సలహా ఇస్తున్నారు.
- సోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడపటం వల్ల టైం వేస్ట్ అవుతుంది. "ఏ యంత్రమైనా. మనిషి కోసమే కానీ, మనిషి వాటికోసం కాదు" అని గుర్తుచేకుంటే ఎప్పటికప్పుడు వాటినుంచి బయటపడొచ్చు. వినోదాలు, వేడుకుల పేరుతో ఎక్కువ సమయాన్ని దుర్వినియోగం చేయటం వల్ల ఒత్తిడి పెరుగుతుంది. అనుకున్న పని సమయానికి కాదు.
- నిద్రలేవగానే ఆ రోజు ఏఏ పనులు చేయాలి? ఏ సమయానికి చేయాలి? అని నిర్ణయించుకుంటే రోజంతా ప్రశాంతంగా గడిచిపోతుంది.
- ఇరవై నాలుగు గంటల్లో ఏడుగంటలు తప్పనిసరిగా నిద్రకు ఉపయోగించుకోవాలి.
