కాళ్లు, చేయి లేకున్నా.. ఎవరెస్ట్ ఎక్కాడు

కాళ్లు, చేయి లేకున్నా.. ఎవరెస్ట్ ఎక్కాడు
  • గోవాకు చెందిన టింకేశ్ అరుదైన ఘనత
  • ఈ ఫీట్ సాధించిన తొలి ‘ట్రిపుల్ యాంప్యుటీ’ వ్యక్తిగా రికార్డు 

పణజి: గోవాకు చెందిన దివ్యాంగుడు టింకేశ్​ కౌశిక్ (30) అరుదైన ఘనత సాధించాడు. రెండు కాళ్లు, ఒక చెయ్యి లేకపోయినా ఎవరెస్ట్​ బేస్ క్యాంప్​ వరకు చేరుకున్నాడు. మూడు అవయవాలు 90 శాతం కోల్పోయి.. ఎవరెస్టును అధిరోహించిన ప్రపంచంలోనే తొలి ‘ట్రిపుల్ యాంప్యుటీ’ వ్యక్తిగా రికార్డులోకి ఎక్కాడు. టింకేశ్​ 17,598 ఫీట్ల ఎత్తులోని ఎవరెస్ట్​ బేస్​ క్యాంప్​నకు చేరుకున్నట్టు ప్రైవేట్​ డిజేబిలిటి రైట్స్​ బాడీ (డీఆర్ఏజీ) ప్రకటించింది. టింకేశ్​ కౌశిక్​ తొమ్మిదేండ్ల వయస్సులో కరెంట్​ షాక్​కు గురయ్యాడు. ఈ ప్రమాదంలో అతను రెండు కాళ్లు, ఓ చెయ్యి కోల్పోయాడు. 

ప్రస్తుతం కృత్రిమ అవయవాలను వాడుతున్నాడు. ఏదైనా సాధించాలనే తపనతో గోవాకు వచ్చాడు. ఫిట్​నెస్​ కోచ్​గా పని చేస్తున్నాడు. ఆ సమయంలోనే ఎవరెస్ట్​ ఎక్కాలని లక్ష్యంగా పెట్టుకొని పట్టుదలతో కృషిచేశాడు. మే 4న నేపాల్​ నుంచి సాహసయాత్ర మొదలుపెట్టి.. మే 11న ఎవరెస్ట్​ బేస్​ క్యాంపుపై జాతీయ జెండా ఎగురవేశాడు. ఈ ప్రయాణంలో తాను  అనేక సవాళ్లను ఎదుర్కొన్నానని, మనోబలంతోనే ఈ రికార్డు సాధించానని టింకేశ్​ తెలిపాడు.