కుత్బుల్లాపూర్ లో ర్యాపిడో బైక్ ను ఢీ కొట్టిన టిప్పర్.. స్పాట్ లోనే ఇద్దరు మృతి

కుత్బుల్లాపూర్ లో ర్యాపిడో బైక్ ను ఢీ కొట్టిన టిప్పర్.. స్పాట్ లోనే ఇద్దరు మృతి

మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కుత్బుల్లాపూర్ లో  రోడ్డు ప్రమాదం జరిగింది. డిసెంబర్ 8 ఉదయం 7 గంటల సమయంలో  ముందు వెళ్తోన్న  ర్యాపిడో బైకును టిప్పర్ ఢీ కొట్టింది.  ఈ ప్రమాదంలో ర్యాపిడో డ్రైవర్ తో పాటు  మహిళ అక్కడికక్కడే మృతి చెందారు.  ఈ ఘటనతో రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.  ఈ ఘటన పక్కనే ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయింది.

స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేశారు . టిప్పర్ ను స్వాధీనం చేసుకున్నారు.   మృతులు   జ్యోతి(32),  ర్యాపిడో డ్రైవర్ సురేందర్ రెడ్డి(45) సూరారం కు చెందిన వారిగా గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చిన పోలీసులు..మృతదేహాలను పోస్టుమార్టం కోసం స్థానిక  ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరారీలో ఉన్న టిప్పర్ డ్రైవర్ ను  పట్టుకునే పనిలో ఉన్నారు పోలీసులు.