ఎక్కిళ్లు తగ్గించే చిట్కాలు

ఎక్కిళ్లు తగ్గించే చిట్కాలు

ఊపిరితిత్తుల కింది భాగాన డయాఫ్రమ్‌‌ ఉంటుంది. ఇది శ్వాస తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. అతిగా తిన్నా, తాగినా, కూల్‌‌ డ్రింక్స్‌‌ లేదా మద్యం తీసుకున్నా చాలామందికి వెక్కిళ్లు వస్తుంటాయి. ఒత్తిడి, హై ఎమోషన్స్‌‌తో ఉన్నా కొందరికి వెక్కిళ్లు వస్తాయి. అంతేగానీ, ‘ఎవరో మన గురించి తలుచుకుంటే’  వెక్కిళ్లు రావు. అయితే సాధారణమైన వెక్కిళ్లకి సైంటిఫికల్‌‌గా ఎలాంటి ట్రీట్మెంట్ లేకపోయినా.. కొన్ని చిట్కాలతో వాటిని కొంత తగ్గించొచ్చు.

  • వెక్కిళ్లు వచ్చే వ్యక్తికి సడన్‌‌ షాక్‌‌, ఎగ్జైటింగ్‌‌గా ఫీల్‌‌ అయ్యే పని చేసినా గ్యాస్‌‌ రిఫ్లక్షన్ ఆగిపోయి వెక్కిళ్లు తగ్గుతాయి.
  • పేపర్ బ్యాగ్‌‌లో తల పెట్టి లేదా పది సెకండ్ల పాటు శ్వాస ఆపుకొని కూడా వెక్కిళ్లను కంట్రోల్ చేయొచ్చు.
  • చల్లని నీళ్లు తాగడం వల్ల డయాఫ్రమ్‌‌ రిలాక్స్‌‌ అవుతుంది. దాంతో వెక్కిళ్లు తగ్గుతాయి.