ప్రపంచంలోనే టాప్ 5 ప్రొటీన్ బ్రేక్ ఫాస్టులు ఇవే : మన సాంబర్ ఇడ్లీకి కూడా ఉంది తెలుసా..!

ప్రపంచంలోనే టాప్ 5 ప్రొటీన్ బ్రేక్ ఫాస్టులు ఇవే : మన సాంబర్ ఇడ్లీకి కూడా ఉంది తెలుసా..!

ప్రతిరోజు ఉదయం ఆఫీస్ వెళ్లేముందు లేదా బయటికి వెళ్లే ముందు ఇంట్లో ఎదో ఒక టిఫిన్ చేస్తుంటాం... అయితే మన తినే టిఫిన్ మన శరీరానికి ఎంత మేలు చేస్తుంది, ఎలాంటి  ప్రోటీన్లు అందిస్తుంది అని ఎక్కువగా పట్టించుకోము.. 

కానీ మన శరీరానికి అవసరమైన, అత్యంత ముఖ్యమైన మాక్రోన్యూట్రియెంట్లలో ప్రోటీన్ ఒకటి. ఇది మన కండరాలు, హార్మోన్లు, జీర్ణవ్యవస్థ, రోగనిరోధక వ్యవస్థ ఇంకా ఇతర వాటికి ఎంతో సహాయపడుతుంది. మన దేశ జనాభాలో ఎక్కువ మంది ప్రోటీన్ లోపంతో బాధపడుతున్నారు. అందుకే ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. 

ప్రోటీన్లు పుష్కలంగా ఉండే టిఫిన్స్ తో మీ డే స్టార్ట్  చేయడానికి మంచి మార్గం. ఈ టిఫిన్స్ మీకు ప్రోటీన్‌లను పెంచడమే కాకుండా ఎక్కువసేపు కడుపు నిండుగా ఉండేలా చేస్తుంది. మీకు నిజంగా  టిఫిన్ కి బదులు గుడ్లు తిని తిని అలసిపోయారా...? డోంట్ వర్రీ, ఈ వీకెండ్లో మీరు ట్రై చేయాల్సిన, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొన్ని ప్రోటీన్ ప్యాక్ టిఫిన్స్ ఇవే... 

 అంతర్జాతీయంగా ప్రొటీన్ ఎక్కువగా ఉండే బ్రేక్ ఫాస్ట్‌లు: మీకు కొత్త రకం ప్రొటీన్ టిఫిన్ కావాలంటే వీటిని ట్రై చేయొచ్చు. అది కూడా చాలా సులభంగా, రుచికరంగా ఇంకా మంచి పోషకాలతో నిండి ఉంటాయి. 

బేసన్ చిల్లా: ఇది మన దేశంలో చాలా ఫెమస్ టిఫిన్. శనగపిండితో చేసే ఈ చిల్లాలో ప్రొటీన్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఇంకా మసాలాలు కలిపి పల్చటి దోసల వేసుకోవాలి. దీన్ని పుదీనా చట్నీతో తింటే చాలా రుచిగా ఉంటుంది.

నాటోతో బియ్యం: నాటో అనేది జపాన్‌లో వాడే నానబెట్టిన సోయాబీన్స్. ఇది ప్రొటీన్‌కు మంచి వనరు. అంతేకాకుండా ఇందులో మన జీర్ణాశయానికి మేలు చేసే ప్రోబయోటిక్స్ కూడా ఉంటాయి. దీన్ని సాధారణంగా అన్నంతో పాటు సోయా సాస్, ఆవాలు కలిపి తింటారు. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది.

ALSO READ : ఈవినింగ్ ఎలాంటి స్నాక్స్ తినాలి..

షక్షుకా: ఈ వంటకం మిడిల్ ఈస్ట్, ఉత్తర ఆఫ్రికా నుండి వచ్చింది. సాధారణంగా దీన్ని గుడ్లతో చేస్తారు, కానీ మీరు ప్రొటీన్ కావాలనుకుంటే గుడ్లు కాకుండా శనగలు వాడవచ్చు. టొమాటో సాస్‌లో క్యాప్సికమ్, మసాలాలు వేసి శనగలు ఉడికించాలి. ఇది చాలా టేస్టీ  టిఫిన్ కూడా.  

ఇడ్లీ, సాంబార్: ఇది మన దక్షిణ భారతదేశంలో చాలా ఫెమస్. ఇడ్లీలు తినడానికి చాల లైట్ గా ఉంటాయి. మినపప్పు ఉండడం వల్ల ప్రొటీన్ ఎక్కువగా ఉంటుంది. సాంబార్ కూడా కందిపప్పుతో చేస్తారు కాబట్టి ప్రొటీన్ ఇంకా అధికంగా ఉంటుంది. ఈ రెండు కలిపి తింటే మన జీర్ణాశయం, జీర్ణప్రక్రియకి మేలు చేసే ప్రొటీన్ ఎక్కువగా ఉన్న టిఫిన్ అవుతుంది. 

హ్యూవోస్ రాంచెరోస్:సాధారణంగా ఈ మెక్సికన్ వంటకాన్ని గుడ్లు, గోధుమ పిండి, సల్సాలతో చేస్తారు. కానీ మీకు ప్రొటీన్, పీచు పదార్థాలు కావాలంటే గుడ్లు కాకుండా బటానీలు లేదా నల్ల బటానీలు వాడవచ్చు. వీటిని కొంత మోతాదులో తీసుకుని చేస్తే మీ వీకెండ్ టిఫిన్ కోసం చాలా బాగుంటుంది.