
తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శనివారం ( జులై 8) ఘాట్ రోడ్డులో అదుపుతప్పి పిట్టగోడను ఢీ కొంది . ఈ ప్రమాదంలో తమిళనాడుకు చెందిన పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. నాలుగోకిలోమీటర్ దగ్గరకు రాగానే తమిళనాడు భక్తులు ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పి పక్కనే ఉన్న పిట్టగోడను ఢీకొంది. దీంతో భారీగా ట్రాఫిక్ జాం అయింది. సమాచారం అందుకున్న పోలీసులు, విజిలెన్స్ సిబ్బంది ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. వీకెండ్ కావడంతో తిరుమల ఘాట్ రోడ్ లో వాహనాల రద్దీ పెరిగింది. తిరుమల ఘాట్ రోడ్డులో ఇటీవల తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఘాట్ రోడ్డులో ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్నట్లు టీటీడీ చెబుతుంది.