తిరుమల : శ్రీవారి సేవలో హీరోయిన్ తమన్నా.. పట్టు వస్త్రాలతో సత్కరించిన అధికారులు

తిరుమల : శ్రీవారి సేవలో హీరోయిన్ తమన్నా.. పట్టు వస్త్రాలతో సత్కరించిన అధికారులు

తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖ సినీ హీరోయిన్ తమన్నా భాటియా పాల్గొన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న తమన్నా... శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.శ్రీవారి సుప్రభాత సేవతో పాటు తోమాల, అర్చన సేవల్లో తమన్నా భాటియా కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు.

దర్శనం అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో తమన్నా కుటుంబ సభ్యులకు వేద పండితులు వేదాశీర్వచనం అందించారు. అనంతరం ఆలయ అధికారులు శేషవస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. తెల్లవారుజామున శ్రీవారి సేవల్లో పాల్గొన్న తమన్నా... సంప్రదాయబద్ధంగా, భక్తిభావంతో కనిపించారు. ఆలయం వెలుపల తమన్నాను చూసేందుకు భక్తులు, అభిమానులు ఆసక్తి చూపారు.