
తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) శ్రీవారి సర్వదర్శనం టోకెన్లను విడుదల చేయనుంది. జనవరి నెలకు సంబంధిచి శ్రీవారి సర్వదర్శనం టోకెన్లను ఈ నెల 27వ తేదీ ఉదయం 9 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని జనవరి 13 నుంచి 22 వరకు రోజుకు 5వేల చొప్పున టోకెన్లు విడుదల చేయనున్నట్లు తెలిపారు. మిగిలిన రోజుల్లో రోజుకు 10 వేల చొప్పున టోకెన్లు విడుదల చేస్తారు. జనవరి నెలకు సంబంధించి భక్తులు ఆన్ లైన్లో సర్వదర్శనం టోకెన్లు బుక్ చేసుకోవాల్సిందిగా చెప్పారు ఆలయాధికారులు.
మరిన్ని వార్తల కోసం...
జైపూర్ ఎయిర్ పోర్టులో రూ. 24 లక్షల గోల్డ్ సీజ్