తిరుమల యాత్ర వాయిదా వేసుకోండి.. టీటీడీ విజ్ఞప్తి..

తిరుమల యాత్ర వాయిదా వేసుకోండి.. టీటీడీ విజ్ఞప్తి..

ఆగస్టు 11 నుంచి 15 వరకు వరుస సెలవుల నేపథ్యంలో తిరుమల శ్రీవారి దర్శనానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశముంది. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం వృద్ధులు, చిన్నారుల తల్లిదండ్రులు, వికలాంగులు తిరుమల యాత్ర వాయిదా వేసుకోవాలని విజ్ఞప్తి చేసింది. భక్తులు దర్శనం, వసతి ముందుగానే బుక్ చేసుకొని రావాలని కోరింది. ఈ మేరకు టీటీడీ ఓ ప్రకటన విడుదల చేసింది. 

వేసవి రద్దీ తగ్గినప్పటికీ వారంతం కావడం, పండుగ నుంచి ఆగస్టు 19 వరకు వరుస సెలవులు ఉన్నాయి. దీంతో పాటు తమిళులకు పవిత్రమైన పెరటాసి మాసం సెప్టెంబర్ 18న ప్రారంభమై అక్టోబర్ 17న ముగుస్తుంది. ఈ మధ్యకాలంలో తిరులకు భక్తుల సంఖ్య అనూహ్యంగా పెరిగే అవకాశముందని టీటీడీ ప్రకటించింది. భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న రోజుల్లో యాత్రికులను నిర్దేశిత సమయాల్లో మాత్రమే దర్శనానికి అనుమతించనున్నట్లు స్పష్టం చేసింది. దర్శనం కోసం గంటల తరబడి కంపార్ట్ మెంట్లు, క్యూలైన్లలో వేచి చూసేందుకు ఓపిక ఉన్నవారు రావాలని సూచించింది.