
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులుగా ఉన్న అదనపు ఎస్సీలు భుజంగరావు, తిరుపతన్నలకు నాంపల్లి కోర్టులో చుక్కెదురైంది. దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను నాంపల్లి కోర్టు కొట్టివేసింది. రాజకీయ దురుద్దేశంతోనే అరెస్టు చేశారని, కేసులో సాక్ష్యాధారాలను కోర్టుకు సమర్పించలేదని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తెచ్చారు. నిందితులను విచారించాల్సి ఉందని, వారికి బెయిల్ మంజూరు చేయొద్దని ప్రభుత్వ తరుపు న్యాయవాది వాదించారు. ఆయన వాదనలతో ఏకీభవించిన కోర్టు బెయిల్ పిటిషన్లను కొట్టివేసింది. ప్రస్తుతం వీరు చంచల్ గూడ జైల్లో ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై మార్చి 10న ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు.. ఇప్పటి వరకు ప్రణీత్‌రావు, భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్‌రావును అరెస్టు చేశారు.