రోడ్లపై గాలి తిరుగుళ్లు తిరిగితే ఊరుకోం : యువతకు పోలీస్ వార్నింగ్

రోడ్లపై గాలి తిరుగుళ్లు తిరిగితే ఊరుకోం : యువతకు పోలీస్ వార్నింగ్

యువతకు ఏపీ పోలీస్ శాఖ వార్నింగ్ ఇచ్చింది.  అసాంఘిక చర్యలకు పాల్పడితే ఉపేక్షించమని హెచ్చరించారు తిరుపతి ఈస్ట్ సీఐ మహేశ్వర్ రెడ్డి. విచ్చలవిడిగా రోడ్లపై తిరుగుతున్న యువతకు కౌన్సిలింగ్ ఇచ్చారు. బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం, మద్యపానం సేవించి అల్లర్లకు పాల్పడితే కేసులు తప్పవని హెచ్చరించారు. 

రోడ్లపై తిరుగుతున్న వాహనాలకు సరైన పత్రాలు లేకుండా తిరిగిన త్రిబుల్ రైడింగ్ కు పాల్పడిన సహించమని వార్నింగ్ ఇచ్చారు. యువత బాధ్యతగా సంఘంలో మెలిగి మంచి పౌరుడు గా ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు సీఐ మహేశ్వర్ రెడ్డి