రికార్డ్ స్థాయిలో శ్రీ వారి దర్శనాలు

రికార్డ్ స్థాయిలో శ్రీ వారి దర్శనాలు
  • ఈనెల 19న రథసప్తమి వేడుకలు

తిరుపతి: కరోనా నేపథ్యంలో ప్రముఖ దేవాలయాలు మూతపడిన విషయం తెలిసిందే. అయితే… ప్రభుత్వాల ఆదేశాలతో దేవాలయాలు తెరుచుకున్నాయి. కరోనా నిబంధనలు పాటిస్తూ.. భక్తులు దేవాలయాలకు వెళుతున్నారు. ఎప్పుడూ భక్తులతో రద్దీగా ఉండే తిరుమల కొండపైన కూడా మొదటిలాగా భక్తులు ఉండటం లేదు. అయితే నిన్నరికార్డు స్థాయిలో  56448 మంది భక్తులు దర్శించుకున్నట్లు సమాచారం. కేవలం తలనీలాలు సమర్పించిన భక్తులే 27323 మంది ఉన్నారు. ఇక హుండి ఆదాయం 3.63 కోట్లుగా ఉంది. లాక్ డౌన్ అనంతరం నిన్నటి రోజున అత్యధిక సంఖ్యలో శ్రీ వారిని దర్శించుకున్నారు. ఇక ఈనెల 19వ తేదిన రథసప్తమి వేడుకలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఆర్జిత సేవలను రద్దు చేసింది టిటిడి.  ఉదయం 6.38 నిముషాలకు శ్రీవారి పాదాలను సూర్యకిరణాలు  స్ర్పుశించనున్నాయి. రథసప్తమి పర్వదినం రోజున సప్తవాహనాలపై భర్తులుకు దర్శనం ఇవ్వనున్నారు మలయప్పస్వామి. అయితే దర్శన టోకెన్లు కలిగిన భక్తులును మాత్రమే గ్యాలరీలోకి అనుమతించనుంది టిటిడి. ఇక రథసప్తమి ఏర్పాట్లును చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ గోపీనాథ్ జెట్టి, అర్బన్ ఎస్పీ వెంకట అప్పలనాయుడు పరిశీలించారు.

ఇవి కూడా చదవండి

ఏపీలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల

నీళ్ల పంచాయితీలపై తిరుపతిలో మార్చి 4న భేటీ

మద్యం మత్తులో యువకుడు వీరంగం: వివాహ వేడుకలో నలుగురికి కత్తి పోట్లు

రూ. 431 కోట్లు కట్టండి : బార్క్​కు టైమ్స్ గ్రూప్ లీగల్ నోటీసు