జూన్ చివరిలోగా తిరుపతి రైలు నిజామాబాద్ వరకు వచ్చేలా చూస్తా : జీవన్ రెడ్డి

జూన్ చివరిలోగా తిరుపతి రైలు నిజామాబాద్ వరకు వచ్చేలా చూస్తా : జీవన్ రెడ్డి

మాజీ సీఎం కేసీఆర్ పై నిజామాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఉద్యమ అక్కంక్షలు నెరవేర్చడంలో కేసీఆర్ విఫలం అయ్యారని విమర్శించారు. కేవలం కుటుంబ ప్రయోజనాలు మాత్రమే నెరవేర్చుకున్నారని ఆరోపించారు. జగిత్యాలలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఇద్దరు మున్సిపల్ కౌన్సిలర్లు, బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు శైలేందేర్ రెడ్డి జీవన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో  అనేక ఒడిదుకులు చూసానని చెప్పారు. ఆస్తులు నష్ట పోతున్నవారికి నష్ట పరిహారం చెల్లించి ఆరు నెలలో జగిత్యాల- యావర్ రోడ్ విస్తరణ చేస్తానని తెలిపారు. రైతాంగానికి అన్ని విధాలుగా ఆదుకునేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని చెప్పారు.రాష్ట్రంలో ప్రతి గృహినికి నెలకు రూ. 2వేల 5 వందలు లాభం చేకూరుస్తున్నామని తెలిపారు. జూన్ చివరిలోగా తిరుపతి రైలు నిజామాబాద్ వరకు, ముంబాయి రైలు జగిత్యాల రైల్వే స్టేషన్ మీదు వెళ్లేలా చర్యలు చేపడుతానని జీవన్ రెడ్డి వెల్లడించారు.