
న్యూఢిల్లీ: టైటాన్ కంపెనీ దుబాయ్‌కు చెందిన జ్యూయలరీ సంస్థ డామస్‌లో 67 శాతం వాటాను 283.2 మిలియన్ డాలర్ల (రూ.2,435 కోట్ల) కు కొనుగోలు చేయనుంది. ఇందుకోసం కతార్‌కు చెందిన మన్నాయి కార్పొరేషన్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ డీల్‌తో యూఏఈ, సౌదీ అరేబియా, కతార్, ఒమన్, కువైట్, బహ్రెయిన్ వంటి గల్ఫ్ దేశాల్లో టైటాన్ విస్తరించడానికి వీలుంటుంది. డామస్‌కు ప్రస్తుతం 146 స్టోర్లు ఉన్నాయి. ఇందులో సొంత, అంతర్జాతీయ బ్రాండ్‌లు ఉన్నాయి.
టైటాన్ ఎండీ సీకే వెంకటరామన్ మాట్లాడుతూ, ‘‘ఈ కొనుగోలుతో గ్లోబల్ అవకాశాలను అందిపుచ్చుకోవడానికి, గల్ఫ్ జ్యుయెలరీ మార్కెట్‌లో మా స్థానాన్ని బలోపేతం చేసుకోవడానికి వీలుంటుంది”అని అన్నారు. ఎన్‌ఎస్‌ఈలో టైటాన్ షేరు సోమవారం 0.74శాతం పెరిగి రూ.3,428 వద్ద ముగిసింది. డామస్‌లో మిగిలిన 33శాతం వాటాను 2029 డిసెంబర్ 31 తర్వాత కొనుగోలు చేసే హక్కు టైటాన్‌కు ఉంటుంది.