- చెలరేగిన పాండ్యా.. టైటాన్స్ టార్గెట్-131
- రాయల్స్ ను కట్టడి చేసిన టైటాన్స్
అహ్మదాబాద్: ఐపీఎల్ సీజన్ -15లో గుజరాత్ టైటాన్స్‌తో రాజస్తాన్ రాయల్స్ ఫైనల్ మ్యాచ్ ఇంట్రెస్టింగ్ గా జరుగుతుంది. టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ తక్కువ స్కోరుకే పరిమితమైంది. స్టార్టింగ్ లో ఆచితూచి బాగానే ఆడుతున్నప్పటికీ .. టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా రాజస్తాన్ ప్లేయర్లో ఒత్తిడి పెంచాడు. కట్టుదిట్టమైన బౌలింగ్, ఫీల్డింగ్, క్యాచెస్ తో టైటాన్స్ రాణించింది. పాండ్యా బౌలింగ్ లో విధ్వంసకర బట్లర్ ఔట్ కావడంతో ఒక్కసారిగా టైటాన్స్ డకౌట్ కేరింతలు. హోమ్ గ్రౌండ్ కావడంతో స్టేడియమంతా హోరెత్తింతి. ఆ తర్వాత ఒక్కో వికెట్ పెవిలియన్ బాట పట్టగా.. మ్యాచ్ లో కీలక పాత్ర పోషించాడు పాండ్యా. రాజస్తాన్ ప్లేయర్లలో బట్లర్(39) టాప్ స్కోరర్. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో రాజస్తాన్ రాయల్స్ 9 వికెట్ల నష్టానికి 130 రన్స్ చేసింది.
గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో ..హార్దిక్ పాండ్యా(3), సాయి కిషోర్(2),రషీద్ ఖాన్(1), యశ్ దయాల్(1), షమీ(1) వికెట్లు తీశారు.
లీగ్ దశలో గుజరాత్ 10 విజయాలతో అగ్రస్థానంలో నిలవగా, రాజస్తాన్ 9 విజయాలతో రెండో స్థానం సాధించింది. ఈ సీజన్‌లో ఇరు జట్ల మధ్య జరిగిన రెండు మ్యాచ్‌లలోనూ గుజరాత్‌దే పైచేయి. క్వాలిఫైయర్-1లో డేవిడ్ మిల్లర్, హార్దిక్ పాండ్యా విజృంభణతో గుజరాత్ చిరస్మరణీయ విజయం అందుకున్న విషయం తెలిసిందే. ఏడు వికెట్ల తేడాతో జయభేరి మోగించి సగర్వంగా ఫైనల్ చేరింది. బౌలర్లు తమవంతు పనొ ఫినిష్ చేయగా.. బ్యాటర్లు రాణిస్తే ఇక కొత్త టీమ్ తోనే విజేతగా నిలవనుంది టైటాన్స్. మరి రాజస్తాన్ బౌలర్లను తక్కువ అంచనా వేయలేం.
The @gujarat_titans captain @hardikpandya7 led from the front, scalping 3⃣ wickets, & was our top performer from the first innings of the #TATAIPL 2022 Final. ? ? #GTvRR
— IndianPremierLeague (@IPL) May 29, 2022
A summary of his performance ? pic.twitter.com/tAgwUmp72s

