తెలంగాణ జూనియర్‌‌‌‌ బాస్కెట్‌‌‌‌ బాల్‌‌‌‌ లీగ్‌ (TJBL)‌‌‌ ప్రారంభం.. ముగిసిన ఆరు ఫ్రాంచైజీల వేలం పాట

తెలంగాణ జూనియర్‌‌‌‌ బాస్కెట్‌‌‌‌ బాల్‌‌‌‌ లీగ్‌ (TJBL)‌‌‌ ప్రారంభం.. ముగిసిన ఆరు ఫ్రాంచైజీల వేలం పాట

 హైదరాబాద్‌‌‌‌: తెలంగాణ బాస్కెట్‌‌‌‌బాల్‌‌‌‌ అసోసియేషన్‌‌‌‌ కొత్తగా తెలంగాణ జూనియర్‌‌‌‌ బాస్కెట్‌‌‌‌బాల్‌‌‌‌ లీగ్‌‌‌‌ (టీజేబీఎల్‌‌‌‌)ను ప్రారంభించింది. గ్రాస్‌‌‌‌ రూట్‌‌‌‌ లెవెల్లో యువ ప్రతిభను గుర్తించి వారిని ఉన్నత స్థాయి ఆటగాళ్లుగా తీర్చిదిద్దడమే దీని లక్ష్యం. ఈ లీగ్‌‌‌‌కు సంబంధించిన ఆరు ఫ్రాంచైజీల వేలం పాట ముగిసింది. ఆరు జట్లకు సంబంధించిన ఫ్రాంచైజీలు ఏకంగా రూ. 1.48 కోట్ల భారీ ధర పలికాయి. తెలంగాణ ప్రొఫెషనల్‌‌‌‌ బాస్కెట్‌‌‌‌బాల్‌‌‌‌ లీగ్‌‌‌‌ (టీపీబీఎల్‌‌‌‌) స్ఫూర్తితో ఈ జూనియర్‌‌‌‌ లీగ్‌‌‌‌ను రూపొందించారు.

హైదరాబాద్ హరికేన్స్, వికారాబాద్ ప్రిడేటర్స్, నల్గొండ నింజాస్, రంగారెడ్డి రూలర్స్, వరంగల్ వైల్డ్‌‌‌‌ఫైర్స్, మెదక్ మాన్‌‌‌‌స్టర్స్ ఫ్రాంచైజీలుగా ఉన్నాయి. పది మంది బిడ్డర్లు ఈ ఫ్రాంచైజీల కోసం పోటీపడ్డారు. బాలుర, బాలికల విభాగాల్లో అండర్‌‌‌‌–15, 18 కేటగిరీల్లో 3 వేల మంది ప్లేయర్లు దరఖాస్తు చేసుకున్నారు. ఈ నెల 22న ప్లేయర్ల వేలం జరుగుతుంది.