- టీజేఏసీ చైర్మన్గజ్జెల కాంతం
హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడే భాష కరెక్ట్‌గా లేదని బీఆర్‌ఎస్‌నేత హరీశ్‌రావు మాట్లాడటం విడ్డూరంగా ఉందని టీజేఏసీ చైర్మన్గజ్జెల కాంతం అన్నారు. భాష గురించి మాట్లాడే అర్హత బీఆర్ఎస్ నేతలకు లేదని ఎద్దేవా చేశారు. శుక్రవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. తొమ్మిది నెలల కాంగ్రెస్పాలనతో ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని తెలిపారు.
ప్రతిపక్షాలు మాత్రం ఓర్చుకోలేక అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయని మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీకి అణగారిన వర్గాలపై ప్రేముంటే వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని దళితుడికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అర్హత ఉండి రుణమాఫీ అందని రైతులందరికీ త్వరలోనే రుణమాఫీ అందిస్తామని చెప్పారు.
బీజేపీ నేతలు కుట్ర చేసి బంగారు లక్ష్మణ్ లంచం తీసుకున్నాడనే నింద మోపి జైలుకు పంపారని తెలిపారు. బీఆర్ఎస్, బీజేపీ ఎంత దోచుకున్నారో ప్రజలకు తెలపడం కోసం ఒక ప్రజా వేదికను ఏర్పాటు చేయబోతున్నామని, ఈ చర్చకు అన్ని సంఘాల ప్రజలు హాజరు కావాలని కోరారు.
