
హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీ కార్మికులు ప్రతినెల పొదుపు చేసుకున్న సీసీఎస్ (క్రెడిట్ కో-ఆపరేటివ్ సొసైటీ) డబ్బును మేనేజ్ మెంట్ వాడుకోవడంపై టీజేఎంయూ ప్రధాన కార్యదర్శి హనుమంతు ఫైర్ అయ్యారు. గత నాలుగేండ్లుగా ఆర్టీసీ కార్మికులు పొదుపు చేసుకుంటున్న డబ్బులు వారి అవసరాలకు ఇవ్వకుండా, సొసైటీలో జమ చేయకుండా ఆర్టీసీ మేనేజ్ మెంట్ వాడుకోవడం క్షమించరాని నేరమని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కార్మికులకు డబ్బులు చెల్లించాలని హైకోర్టు ఆదేశించినప్పటికీ మేనేజ్ మెంట్ పద్ధతి మారలేదన్నారు.
కార్మికుల బేసిక్ పే నుంచి సీసీఎస్కు జమ చేయడానికి మేనేజ్మెంట్ కు అధికారం ఇస్తే కంచే చేను మేసిన విధంగా ఉందన్నారు. కార్మికులకు చెల్లించవలసిన రూ.1150 కోట్లు వెంటనే సీసీఎస్ ఖాతాలో జమ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.