- గాదె ఇన్నయ్యపై కేసును ఉపసంహరించుకోవాలి: కోదండరాం
హైదరాబాద్, వెలుగు: ప్రముఖ రచయిత గాదె ఇన్నయ్యపై నమోదు చేసిన కేసును వెంటనే ఉపసంహరించుకోవాలని టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం డిమాండ్ చేశారు. ఇన్నయ్యపై కేసు పెట్టడం చాలా అన్యాయమని, ప్రజాస్వామ్యానికి విరుద్ధమని శనివారం ప్రకటనలో పేర్కొన్నారు. ‘‘రాజకీయాల్లో మన చుట్టూ జరుగుతున్న అంశాలపై స్పందించడం నేరం కాదు.
నేరం రుజువు కాకముందే శిక్ష ఖరారు చేసే వింత చట్టమే యూఏపీఏ(ఉపా). గాదె ఇన్నయ్యను అరెస్టు చేసి బయటకు రాకుండా చేయడం అన్యాయం. ఆయన అనాథాశ్రమాన్ని నడుపుతున్నారు. అందులోని 150 మంది పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం మానవతా దృక్పథంతో గాదె ఇన్నయ్యను వెంటనే విడుదల చేయాలి” అని కోదండరాం విజ్ఞప్తి చేశారు.
