ఆర్మీలో లేని నిబంధనలు పోలీస్ అభ్యర్థులకా కేసీఆర్ : కోదండరాం

ఆర్మీలో లేని నిబంధనలు పోలీస్ అభ్యర్థులకా కేసీఆర్ : కోదండరాం

ఆర్మీలో లేని నిబంధనలను ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు పెడ్తున్నారని టీజేఎస్ అధినేత కోదండరాం అన్నారు. కష్టపడి చదివి ప్రిలిమ్స్ పాస్ అయిన అభ్యర్థులు కఠిన నిబంధనల కారణంగా ఉద్యోగానికి దూరమవుతున్నారన్నారు. ఫిజికల్ టెస్ట్లో ప్రమాణాలు చాలా కఠినంగా ఉన్నాయని..వెంటనే వాటిని సరళించాలన్నారు. 

ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని.. గతంలో ఉన్న నిబంధనలనే పెట్టాలని కోదండరాం చెప్పారు. ప్రభుత్వం స్పందించేవరకు అభ్యర్థులకు అండగా ఉంటామని స్పష్టం చేశారు. తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక ప్రజలు తీవ్ర ఇబ్బందలు పడుతున్నారన్నారు. సీఎం కేసీఆర్ అభ్యర్థుల న్యాయమైన సమస్యలు పరిస్కరించాలని డిమాండ్ చేశారు. గోటితో పొయే దాన్ని గొడ్డలి వరకు తెచ్చుకోవద్దని హితవు పలికారు. 

రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పెరుగుతోంది

రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పెరుగుతోందని విమలక్క అన్నారు. ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థుల పోరాటంలో న్యాయం ఉందన్నారు. అభ్యర్థులు ధైర్యాన్ని కోల్పోవద్దని సూచించారు. సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని సూచించారు.