ధాన్యం కొనుగోళ్లు లేట్‌ కావడంతో అవస్థలు పడుతున్న రైతులు

ధాన్యం కొనుగోళ్లు లేట్‌ కావడంతో అవస్థలు పడుతున్న రైతులు

ప్రభుత్వం సకాలంలో ధాన్యం కొనుగోళ్లు చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్తున్నారన్నారు TJS అధ్యక్షుడు కోదండరాం. సీపీఎం సీనియర్ నేత జూలకంటి రంగారెడ్డితో కలిసి నల్గొండ జిల్లా మాడుగులపల్లి ఐకేపీ సెంటర్ ను పరిశీలించారు. రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. దసరాకు వరి కోతలు మొదలై ధాన్యం చేతికి వచ్చినా దీపావళి వరకు కూడా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదన్నారు కోదండరాం. అనుకున్న టైంలో   కొనుగోళ్లు జరక్కపోవడంతో వర్షాలకు ధాన్యం తడిసి రైతులు అవస్థలు పడ్తున్నారని చెప్పారు.