
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం కమీషన్ ల కోసమే.. ప్రాజెక్టులు రీడిజైన్ చేస్తున్నదని విమర్శించారు TJS అధ్యక్షుడు కోదండరాం. కాళేశ్వరం ప్రాజెక్ట్ రీ డిజైన్ చేయకుండా ఉండి ఉంటే… తెలంగాణ లో ఉన్న ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ లు అన్ని పూర్తయ్యేవని ఆయన అన్నారు
గురువారం జర్నలిస్టుల ఫోరమ్ ఆధ్వర్యంలో కృష్ణానది పెండింగ్ ప్రాజెక్టుల అంశంపై సదస్సు జరిగింది. ఈ సదస్సులో పాల్గోన్న కోదండరాం మాట్లాడుతూ.. నదీ జలాల వాటాలు కేటాయింపులు జరగకుండా… కృష్ణా నది ప్రాజెక్ట్ ల పై ఇరు రాష్ట్రాల సీఎం లు ఏం చర్చించారని ప్రశ్నించారు. గోదావరి ,కృష్ణా నదుల అనుసంధానం అనేది.. వచ్చే ఎన్నికలకు నిధులు సమకూర్చుకోవడం కోసమేనని విమర్శించారు.
రాయలసీమ ఎత్తిపోతల ద్వారా.. కృష్ణా నది నీళ్ళు మొత్తం రాయలసీమ కు తరలించే కుట్ర జరుగుతుందన్నారు. ఈ విషయంలో ప్రజా ప్రతినిధుల పై ఒత్తిడి తెస్తే తప్ప ప్రభుత్వం దిగివచ్చేలా లేదని.. అందరం కలసి ప్రభుత్వం పై వత్తిడి తెద్దామని అన్నారు.