మహువా మొయిత్రాకు మళ్లీ టికెట్

మహువా మొయిత్రాకు మళ్లీ టికెట్

‘క్యాష్ ఫర్ క్వశ్చన్స్’ ఆరోపణలతో పార్లమెంట్ సభ్యత్వం కోల్పోయిన టీఎంసీ నాయకురాలు మహువా మొయిత్రా మళ్లీ ఎంపీగా పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఆమెను కృష్ణానగర్ లోక్​సభ స్థానం టీఎంసీ అభ్యర్థిగా ఆ పార్టీ చీఫ్ మమతా బెనర్జీ ప్రకటించారు.

కోల్​కతా: ‘క్యాష్ ఫర్ క్వశ్చన్స్’ వివాదంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొని పార్లమెంట్ సభ్యత్వం కోల్పోయిన టీఎంసీ నాయకురాలు మహువా మొయిత్రా మళ్లీ ఎంపీగా పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. కృష్ణానగర్ నుంచి లోక్​సభ అభ్యర్థిగా ఆమెను టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ బరిలో దింపారు. లోక్​సభ నుంచి బహిష్కరణకు గురికావడంతో ఇక మహువా రాజకీయ జీవితం ముగిసినట్టే అని చాలామంది అనుకున్నారు. 

కానీ.. అనూహ్యంగా ఆమెను మళ్లీ అదే లోక్​సభ సెగ్మెంట్ నుంచి టీఎంసీ చీఫ్ బరిలోకి దింపారు. ఈమేరకు ఆదివారం కోల్‌‌‌‌‌‌‌‌కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్ ఏర్పాటు చేసిన సభలో టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీ 42 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. కాగా,  బెంగాల్​లో తాము ఒంటరిగానే పోటీ చేస్తామని ఇప్పటికే ఇండియా కూటమి నేతలకు మమత తేల్చి చెప్పారు. క్యాష్ ఫర్ క్వశ్చన్ వివాదంలో మహువా ఆరోపణలు ఎదుర్కొంటున్న టైమ్​లో టీఎంసీ ఆమెకు మద్దతు ఇచ్చేందుకు ఆసక్తి చూపించలేదు. ఎథిక్స్ కమిటీ విచారణ తర్వాత ఆమె లోక్​సభ నుంచి బహిష్కరణకు గురయ్యారు. అప్పుడు పార్టీ చీఫ్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పందించారు. మహువాపై బహిష్కరణ వేటును.. ప్రజాస్వామ్య హత్యగా అభివర్ణించారు.