ఆర్టీసీ బిల్లు ఆమోదించండి..లేదంటే మళ్లీ ఆందోళనలు

ఆర్టీసీ బిల్లు ఆమోదించండి..లేదంటే మళ్లీ ఆందోళనలు

హైదరాబాద్: అసెంబ్లీలో పాసైన ఆర్టీసీ ఉద్యోగుల విలీన బిల్లపై గవర్నర్ సంతకం చేయాలని టీఎంయూ నేత థామస్ రెడ్డి కోరారు. ఇవాళ సెక్రటేరియట్ మీడియా సెంటర్ లో ఆయన మాట్లాడుతూ..సాయంత్రంలోగా గవర్నర్ ఆమోదం తెలిపి సంతకం చేయాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు.

ఆర్టీసీపై ప్రభుత్వానికి సమగ్ర నివేదిక అందించామని, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాలు ఉండాలని అన్నారు. ఈ నెల నుంచే ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, క్యాడర్ల వారీగా అందరికీ న్యాయం చేయాలని కోరారు.  అధ్యయన కమిటీలో టీఎంయూ నేతలకు అవకాశం కల్పించాలని కోరారు.  ఏపీఎస్ ఆర్టీసీ విలీనంలో చాలా లొసుగులున్నాయని, వాటికి తావులేకుండా ఉండేందుకు ప్రత్యేక రిపోర్ట్ ను ప్రభుత్వానికి అందించామని, కార్మికులు ఆందోళన చెందవద్దని థామస్ రెడ్డి సూచించారు.