Mr. Reddy: రియల్ లైఫ్‌‌ స్టోరీతో ‘మిస్టర్ రెడ్డి’.. ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌

Mr. Reddy: రియల్ లైఫ్‌‌ స్టోరీతో ‘మిస్టర్ రెడ్డి’.. ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌

టి. నరసింహా రెడ్డి లీడ్ రోల్‌‌లో నటిస్తూ, నిర్మించిన చిత్రం ‘మిస్టర్ రెడ్డి’.మహాదేవ్, అనుపమ ప్రకాష్, దీప్తి శ్రీరంగం హీరో హీరోయిన్స్‌‌గా నటించారు. వెంకట్ వోలాద్రి దర్శకత్వం వహించాడు. జులై 18న సినిమా విడుదల కానుంది.

ఈ  సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌‌లో టీఎన్‌‌ఆర్ మాట్లాడుతూ ‘ఇది నా జీవితంలో జరిగిన కథ. ఇందులోని ప్రేమ కథ అందరినీ ఆకట్టుకుంటుంది. అన్ని రకాల ఎమోషన్స్‌‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది’ అని అన్నారు.

టీమ్ అందరి సపోర్ట్‌‌తో అవుట్‌‌పుట్ బాగా వచ్చిందని  దర్శకుడు వెంకట్ వోలాద్రి చెప్పాడు. తమకు అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు నటీనటులు థ్యాంక్స్ చెప్పారు. మూవీ టీమ్ అంతా కార్యక్రమంలో పాల్గొన్నారు.