డెడ్​బాడీ తీసుకుపోనీకి  రూ.15 వేలడిగిన్రు

V6 Velugu Posted on May 21, 2021

అశ్వారావుపేట, వెలుగు: రోజువారీ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న కుటుంబంలో కరోనా పెను విషాదాన్ని మిగిల్చింది. కరోనాతో ఓ మహిళ చనిపోగా డెడ్​బాడీని స్వగ్రామానికి తీసుకెళ్లడానికి అంబులెన్స్​ను అడిగితే రూ.15 వేలు డిమాండ్​ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం కొత్త నారంవారి గూడెం కాలనీకి చెందిన జి.మాణిక్యం(45) ఈ నెల 17న కరోరా టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ వచ్చింది. 18న బ్రీతింగ్ ప్రాబ్లం రావటంతో కుటుంబసభ్యులు కొత్తగూడెం గవర్నమెంట్ హాస్పిటల్ కు తీసుకువెళ్లారు. గురువారం రాత్రి చనిపోయింది.

డెడ్​బాడీని ఇంటికి తీసుకెళ్లేందుకు కుటంబ సభ్యులు అంబులెన్సును అడిగారు. 90 కిలోమీటర్ల దూరంలోని ఊరికి రూ. ఐదు లేదా ఆరు వేలకు మించి తీసుకోకూడదు. కానీ ఎన్ని అంబులెన్సులను అడిగినా రూ. 15 వేలకు తక్కువ చెప్పలేదు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక పవన్​కల్యాణ్ ​సేవా సమితి అధ్యక్షుడు డేగల రామచంద్ర రావు అంబులెన్స్​ పంపించి బాడీని గ్రామానికి తరలించారు.ని కోరారు.

Tagged Dead body, corona, Bhadradri Kottagudem district,

Latest Videos

Subscribe Now

More News